Header Banner

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. ఒక్క ఓటుతో టీడీపీ విజయం! మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ!

  Mon Jun 16, 2025 12:44        Politics

ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు ఛైర్మన్ గా.... గతంలో ఇండిపెండెంట్‌గా గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన శ్రీదేవి వైస్ ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. వివరాల్లోకి వెళితే, కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన శ్రీదేవి టీడీపీకి మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. అదే సమయంలో, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన ఎక్స్ అఫిషియో ఓటును వైసీపీకి వేయడంతో ఆ పార్టీ బలం కూడా 15కు సమమైంది. ఈ తరుణంలో, అప్పటి పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని టీడీపీకి అనుకూలంగా తన ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

అయితే, ఈ ఓటు చెల్లుబాటుపై వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, 2021లో కేశినేని నాని వేసిన ఎక్స్ అఫిషియో ఓటు చెల్లుతుందని స్పష్టం చేస్తూ సీల్డ్ కవర్‌లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీడీపీ బలం 16కు పెరిగింది. ఈ క్రమంలో ఈరోజు భారీ బందోబస్తు మధ్య సీల్డ్ కవర్ ను తెరిచి అధికారులు ఫలితాలను ప్రకటించారు. చెన్నుబోయిన చిట్టిబాబు కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌గా, శ్రీదేవి వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కీలకమైన మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chennuboyina Chittibabu #Kondapalli #Municipality #TDP #Andhra Pradesh #local body elections #Sridevi #Kesineni Nani #Vasantha #Krishna Prasad #NTR district